Indo-China: డ్రాగన్ కవ్వింపులు.. వివాదాస్పద సరిహద్దుపై పాక్‌తో ఒప్పందం.. భారత్ మండిపాటు
- భారత భూభాగంలో చైనా కవ్వింపులు
- పాకిస్థాన్‌తో అడ్డగోలు ఒప్పందం
- తీవ్రంగా ఖండించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రాగన్ దేశం మరోసారి భారతదేశంతో కయ్యానికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయన్న తరుణంలో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. షక్స్‌గామ్ వ్యాలీ సరిహద్దు వివాదంతో భారత దేశాన్ని రెచ్చగొడుతోంది. చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని షాక్స్‌గామ్ లోయ ఉంది. ఇది భారతదేశ భూభాగం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వివాదాస్పదంగా ఉంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ సరిహద్దులో ఉన్న ఒక సున్నితమైన ప్రదేశం. ఎత్తైన ఎత్తులో షాక్స్‌గామ్ లోయగా ఉంది. వివాదాస్పద సియాచిన్/అక్సాయ్ చిన్ ప్రాంతానికి దగ్గరగా ఉంది. అయితే ఈ లోయ పూర్తిగా ప్రస్తుతం భారత భూభాగంలోనే ఉంది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
తాజాగా పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి షాక్స్‌గామ్ లోయలో 5,180 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు చట్టవిరుద్ధంగా దాయాది దేశం అప్పగించింది. రెండు దేశాలు కూడా సరిహద్దు ఒప్పందంపై సంతకం చేశాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో తాజాగా పేర్కొన్నారు. ఈ పరిణామంపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూభాగంపై భారతదేశానికి మాత్రమే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని ఖండించింది.
బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో భారతదేశం లేవనెత్తిన అభ్యంతరాలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఆ భూభాగం.. చైనా భూభాగంలో భాగంగా ఉందని.. చైనా తన సొంత భూభాగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని తెలిపింది. ఇస్లామాబాద్‌తో చేసుకున్న ఒప్పందం సరైందిగానే అభిప్రాయపడింది. 1960 నుంచి కూడా రెండు దేశాలు సరిహద్దును నిర్ణయించిందని తెలిపింది. సార్వభౌమ దేశాలుగా పాకిస్థాన్-చైనా హక్కులుగా వ్యాఖ్యానించారు.
భారత్ ఖండన
షక్స్‌గామ్ లోయలో చైనా చేస్తున్న మౌలిక సదుపాయాల పనులను భారతదేశం శుక్రవారం ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘షక్స్‌గామ్ లోయ భారత భూభాగం. 1963లో సంతకం చేయబడిన చైనా-పాకిస్థాన్ ‘సరిహద్దు ఒప్పందం’ అని పిలవబడే దానిని మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఆ ఒప్పందం చట్టవిరుద్ధం. ఆ ఒప్పందం చెల్లదని మేము నిరంతరం వాదిస్తున్నాము.’’ అని పేర్కొన్నారు. భారత భూభాగం గుండా వెళ్లే చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్‌ను గుర్తించడం లేదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేశారు. మా ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు మాకు ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!