ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్‌లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్‌లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అభయ్‌సింగ్ పాకిస్థాన్‌కు చెందిన జమాన్ నూర్‌పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రపంచ కప్‌కు ముందు ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ 2023లో సిరాజ్ ఆటతీరు చూడదగినదని స్టెయిన్ చెప్పాడు. ప్రపంచకప్‌లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్లపైనే ఉంటుందని స్టెయిన్ అన్నాడు. అందులో మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు కీలకమని నిరూపించుకుంటాడని తెలిపాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1324 కోట్ల రూపాయల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. breaking news, latest news, telugu news, Nama Nageswara Rao, minister ktr, cm kcr
కొద్ది సేపటి లో ఇంటికి వెళ్లాల్సిన మహిళా కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది... మొదటి సారిగా రామాలయం వద్ద వున్న స్లుయిస్ లో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది.. భద్రాచలం పట్టణంలోని రామాలయం వద్ద జరిగిన ఘోర ఘటన... breaking news, latest news, telugu news, head constable passes away, minister ktr
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు పార్టీల్లో చేరికలు జోరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ గూటికి మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ చేరారు. breaking news, latest news, telugu news, etela rajender
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది.
వన్డే ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చివరలో అక్షర్ పటేల్ స్థానంలో ఆర్.అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయం కావడంతో.. ఇంకా కోలుకోలేదు. దీంతో అశ్విన్ జట్టులో చేరాడు. అయితే అశ్విన్ టీమ్ లోకి రావడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జట్టు కోసం అశ్విన్ ఎంపిక చేయడంపై అసంతృప్తిని…
మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్, కాంగ్రెస్ లోపల కలిసి ఉండి బయటికి కొట్లాడినట్టు నటిస్తున్నాయని విమర్శించారు డీకే అరుణ. breaking news, latest news, telugu news, dk aruna, cm kcr, brs, bjp
వన్డే ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అక్కడ వర్షం పడుతుంది. ఆ కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.