RBI: రూ.2 వేల నోటు కథ ముగిసిందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Last Date To Exchange Rs 2,000 Note Is September 30, Clarifies RBI: రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగించే ప్రసక్తే లేదని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 30 అనంతరం రూ.2వేల నోటు చెల్లకుండా మిగిపోతుంది. అయితే, ఇప్పటికే ఆ నోటును ప్రజలు బ్యాంకులలో జమచేశారు. ఇతరత్రా లావాదేవీల ద్వారా మార్పిడి చేసుకున్నారు. అయినా ఈ నోట్ల మార్పిడి విషయంలో కొందరు ఏమరుపాటుగా ఉన్నారని, అలాంటి వారు శనివారం లోగా మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.
Also Read: Rs.2000 Notes: రేపే చివరి రోజు.. ఆ తర్వాత 2వేల నోట్లు కనపడవు!
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
రూ.2వేల నోటును మార్చుకోవడానికి ప్రజలకు తగిన సమయాన్ని అందించడానికి ఆర్బీఐ ముందుగా సెప్టెంబర్ 30, 2023ని చివరి తేదీగా నిర్ణయించింది. సెప్టెంబర్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆగస్టు 31 వరకు, మొత్తం చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 93 శాతం ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. అదే సమయంలో సెప్టెంబర్ ప్రారంభం వరకు దాదాపు రూ.24,000 కోట్ల విలువైన నోట్లు మార్కెట్‌లో ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఎటువంటి డేటాను విడుదల చేయనప్పటికీ, ఇందులో కొంత భాగాన్ని ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉండవచ్చు. అయితే ఇప్పటికీ ఈ నోట్లు ఉన్నవారు ఉన్నవారు రేపు బ్యాంకు లేదా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఇతర నోట్లతో మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.
మే 19, 2023 న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోనే అతిపెద్ద కరెన్సీ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది, అంటే రూ. 2,000 నోటును చెలామణి నుంచి తీసివేసింది. మార్కెట్‌లో ఉన్న ఈ నోట్లను తిరిగి ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తూ, ఆర్‌బీఐ బ్యాంకుల ద్వారా రిటర్న్ చేయడానికి లేదా మార్పిడికి సెప్టెంబర్ 30 తేదీని నిర్ణయించింది. రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పుడు, ఆర్బీఐ ప్రకారం, మార్చి 31, 2023 వరకు రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోటు నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది. ఆ సమయంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత రూ.2వేల నోట్లు ఆర్బీఐ తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!