MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని ఎంత కూల్ గా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధోనీ ఎక్కడికి వెళ్లిన అతని కోసం అభిమానులు ఎగపడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని ధోనీపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. విమానాశ్రయంలో ధోనిని చూసి ‘మహీ భాయ్ ఐ లవ్ యూ’ అంటూ గట్టిగా అరిచాడు. దీనికి ధోని చిన్న చిరునవ్వు నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Urvashi Rautela: ఊర్వశీ రౌటేలా వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ధర అన్ని లక్షలా?
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్య బాధ్యతలు వ్యవహరిస్తున్నాడు. 2023లో జట్టుకు టైటిల్ ను అందించి పెట్టాడు. ఐపీఎల్ లో చెన్నైకి ఐదవ టైటిల్ కాగా.. అతని సారథ్యంలో వచ్చాయి. మరోవైపు ధోనీ తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ధోనీ వీడియోలను చూసేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఇదిలా ఉంటే.. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించి పెట్టిన ఏకైక కెప్టెన్ ధోనీ. భారత్ ఇప్పటివరకు కేవలం నాలుగు ICC ట్రోఫీలను మాత్రమే గెలుచుకుంది. వాటిలో మూడు ధోనీ కెప్టెన్సీలో వచ్చినవే. అతని కెప్టెన్సీలో మొదటి ICC ట్రోఫీని T20 ప్రపంచ కప్ 2007, రెండవది ODI ప్రపంచ కప్ 2011, మూడవది 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిపించాడు.
The love and respect for MS Dhoni! pic.twitter.com/LRfUzKTdOK
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2023