పాకిస్తాన్ విడిచి పారిపోతున్న ఆటో మొబైల్ కంపెనీలు.. ఇక సెకండ్ హ్యాండ్ వాహనాలే దిక్కు ప్రపంచ దేశాల ముందు బిల్డప్పులు కొట్టే పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితిని చూసి వణికిపోయే పరిస్థితి దాపరించింది. విదేశీ అప్పుల భారం పెరిగింది, డాలర్ కొరత ఉంది. IMF షరతులు విధిస్తోంది. తత్ఫలితంగా, పాకిస్తాన్ ఆటోమోటివ్ పరిశ్రమ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక పరిస్థితి, IMF ఒత్తిడితో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది. ఇది పాకిస్తాన్…
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది సీఎం తీరు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతామని…
గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్ తమిళనాడులోని కరూర్ లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే 40 మంది దాకా చనిపోయారు. ఇంకా పదులకొద్దీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమిళనాడు అగ్ర హీరోలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై కమల్ స్పందిస్తూ.. కరూర్ తొక్కిసలాట గురించి విని నా గుండె వణికిపోయింది. ఆ…
రామ్ చరణ్ సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తి.. “పెద్ది” నుంచి మాస్ పోస్టర్ విడుదల! 2007లో చిరుత సినిమాతో చేసిన అరంగేట్రం ఈ రోజు 18 సంవత్సరాల మైలురాయిని తాకింది. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో…
సోనమ్ వాంగ్‌చుక్ కేసులో పాకిస్తాన్ కోణం.. దర్యాప్తులో సంచలన విషయాలు.. బుధవారంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ ఆందోళనల్లో నలుగురు మరణించడంతో పాటు 50కి పైగా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పాటు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ఈ హింసను ప్రేరేపించేలా చేశాడని లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై కేంద్ర ప్రభుత్వం కేసు…
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబర్ 29 (సోమవారం)వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. అయితే, 29వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్లతో వాదిస్తారు. ఇక, అక్టోబర్ 1వ తేదీన ఫిర్యాదుదారు అడ్వకేట్స్ తో పాటు పార్టీ మారిన లాయర్లతో వాదిస్తారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి…
చిరంజీవిని తిడితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు! సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ…
లగ్జరీ కార్ల వెనకున్న బసరత్ ఖాన్ రహస్యాలు..? హైదరాబాద్‌లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని SK కార్ లౌంజ్తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ ఈ దాడులు జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో భాగంగా, స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసిన హైఎండ్ కార్ల వ్యవహారాలపై అధికారులు ఈ సోదాలు చేపట్టారు. బసరత్ ఖాన్ ఇప్పటికే…
కాపీరైట్ కేసులో ఊరట గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్‌గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్‌లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్‌ను అనుమతించడంతో పాటు,…
రాష్ట్ర హోదా కల్పించాలని లడఖ్‌లో నిరసనలు.. బీజేపీ ఆఫీస్ దగ్ధం రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అలాగే బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం లడఖ్‌లోని లేహ్…