Botsa Satyanarayana: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మరణించిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తొక్కిసలాట సంఘటనలు మూడుసార్లు జరిగాయని గుర్తు చేశారు. ఆలయ ప్రతిష్టాపన తర్వాత ప్రతి శనివారం సుమారు 2 వేల మంది వస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కానీ, నిన్న ఎక్కువ జనం పెరిగారని తెలిపారు. తాము ఈ విషయంపై రాజకీయం చేయదలచుకోలేదని, కానీ ప్రభుత్వం తమ బాధ్యతలు మార్చిపోయిందని బొత్స కోరారు.
Read Also: Jogi Ramesh: నాలుగు గంటలుగా పోలీస్ స్టేషన్లోనే జోగి రమేష్.. ఇంట్లో సిట్ సోదాలు!
ఇక, స్థానిక పోలీసులు ఇద్దరు ముగ్గురు పంపించి ఉంటే సరిపోయేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలని, సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎవరిపై నిర్దిష్ట చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా అని సందేహం వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయని ఎత్తి చూపారు. ప్రభుత్వ దుర్మార్గాల కారణంగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయో చూడొచ్చు.. సీఎం చంద్రబాబు, లోకేష్, ఆనం బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలి.. కేవలం గాలి కబుర్లు చెప్పడానికి కాదు అధికారం కట్టబెట్టింది అని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ప్రాణాలకు విలువ కట్టలేమని, మానవత్వం తో వ్యవహరించాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరారు.
Read Also: India vs South Africa: మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌కు వానగండం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి..?
అలాగే, పలాస తొక్కిసలాట ఘటనను ప్రక్కదోవ పట్టించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని బొత్స సత్యనారాయణ తెలిపారు. జయచంద్రా రెడ్డినీ ఎందుకు వదిలేశారు.. ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో, లబ్ధి కోసం ఆలోచిస్తుందన్నారు.