వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రియుడే సూత్రధారి..
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న, ఒడిశాకు చెందిన అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందిగుడిని ఫిర్దౌస్ షేక్‌గా గుర్తించారు. మరో ఐదుగురిని సహ నిందితులుగా పేర్కొన్నారు. సహ నిందితుల్లో బాధితురాలి ప్రియుడు అయిన సహ విద్యార్థి కూడా ఉండటం గమనార్హం. బాధితురాలి న్యాయవాది పార్థా ఘోష్ మాట్లాడుూత.. సామూహిక అత్యాచార సంఘటనలో క్లాస్‌మేట్, ప్రధాన కుట్రదారుడు లేదా సూత్రధారి అని అన్నారు.
ఆఫ్ఘానిస్తాన్‌పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాలు కూడా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. అయితే, ఈ వివాదాలు తగ్గేలా టర్కీ వేదికగా రెండు దేశాలు శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. షాకింగ్ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై జరుగుతున్న డ్రోన్ దాడుల్ని అడ్డుకోలేమని, దీనికి ఒక విదేశంతో జరిగిన రహస్య ఒప్పందం కారణంగా అని చెప్పింది. అయితే, పాకిస్తాన్ ఈ ఒప్పుకోలుతో అన్ని వేళ్లు అమెరికా వైపు వెళ్తున్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. కాబూల్‌లో ఉన్న బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తమకు ఇవ్వాలని ట్రంప్, తాలిబాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా కోరాడు. ఒకవేళ దీనికి ఒప్పుకోకుంటే ‘‘చెడు పరిణామాలు’’ సంభవిస్తాయని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ దాడుల వెనక అమెరికా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ నుంచి జరుగుతున్న డ్రోన్ దాడుల్లో మూడో దేశం ప్రయేమం ఉన్నట్లు ఆఫ్ఘాన్‌కు చెందిన టోలో న్యూస్ తెలిపింది.
మహాఘట్ బంధన్ మేనిఫెస్టో విడుదల.. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహా కూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి “బీహార్ కా తేజస్వి ప్రణబ్” అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మానిఫెస్టోలో, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహా కూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని, బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ అని మహా కూటమి పేర్కొంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, కాంగ్రెస్‌కు చెందిన పవన్ ఖేరా, ముఖేష్ సాహ్ని, వామపక్షాల ప్రతినిధులు, ఇతర మిత్రదేశాల నాయకులు మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో వేదికపై పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, “ఇది మా మ్యానిఫెస్టో మాత్రమే కాదు, బీహార్ ప్రజల ప్రతిజ్ఞ. ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగం, వలసలు, అవినీతి నుండి విముక్తి చేస్తాము” అని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలనా వైఫల్యం, అవినీతి, పెరుగుతున్న నిరుద్యోగానికి కారణమని తీర్మానం ఆరోపించింది.
శ్రేయస్ అయ్యర్‌కు సర్జరీ.. ఇప్పుడెలా ఉన్నారంటే!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డే సందర్భంగా.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ సంఘటనలో శ్రేయస్ ప్లీహానికి గాయమైంది. అనంతరం ఆయనను సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలో అయ్యర్‌కు స్వల్ప అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా శ్రేయస్ అయ్యర్ శస్త్రచికిత్సకు సంబంధించి ఒక అప్‌డేట్ వచ్చింది.
దూసుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్.. నిరంతర పర్యవేక్షణ, హై-లెవల్ సన్నాహాలు జరుగుతున్నాయి..!
గత ఐదు రోజులుగా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న భారీ తుఫాన్ ఈ రాత్రి సుమారు 11 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం దాదాపు 40 లక్షల మందిపై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాణ నష్టం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే తుఫాన్‌పై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న రియల్ టైం రిపోర్టులు ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) కూడా చేరుతున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. మొత్తం 1328 గ్రామాల్లో ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ విపత్తు కారణంగా NDRF, SDRF బృందాలు ఇప్పటికే సన్నద్ధంగా ఉన్నాయని.. అవసరమైతే రంగంలోకి దిగేందుకు హైదరాబాద్‌లో ఆర్మీ బృందాలు కూడా అలెర్ట్‌గా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఈ నెల 29 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
పెంచే సినిమా టికెట్ రేట్లలో కార్మికులకు 20 శాతం.. లేకుంటే జీఓ ఇవ్వం
యూసుఫ్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినీ కార్మికుల శ్రమ నాకు బాగా తెలుసు. మీ కష్టాలు తెలుసుకోలేనంతగా నా కళ్లూ మూసుకోలేదు” అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. “ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే మద్రాసే అనుకునే వారు. కానీ, నేడు తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుల వరకు వెళ్లగలిగింది. ఈ గౌరవం తెర వెనుక కష్టపడే కార్మికుల శ్రమ ఫలితమే” అని రేవంత్ అభినందించారు.
తీరాన్ని తాకిన ‘మొంథా’ తుఫాన్.. అక్కడ 8:30 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత..
అందిన సమాచారం మేరకు ‘మొంథా’ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 3-4 గంటలు అత్యంత కీలకం కానుంది. తుఫాను తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులతో కలిపి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ‘మొంథా’ తుఫాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ ప్రభావిత ఏడు జిల్లాల్లో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆ వాహనాలపై నిషేధం.. ఎందుకంటే?
ఢిల్లీ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఢిల్లీలోని కాలుష్యం ఊపిరాడకుండా చేస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే నవంబర్ 1 నుండి, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని అన్ని కమర్షియల్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ ఉత్తర్వును కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) జారీ చేసింది. ముఖ్యంగా శీతాకాలంలో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటోంది.
రేపు రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించనున్న సుప్రీం కమాండర్..
హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్టేషన్‌లో ఒక చారిత్రాత్మక క్షణానికి వేదిక కానుంది. రేపు (అక్టోబర్ 29, 2025న) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించనున్నారు. ఇది ఆమె అధ్యక్ష పదవిలో మరో ప్రధాన మైలురాయిని నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇది భారతదేశంలో పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని అంటున్నారు. రాష్ట్రపతి ముర్ము భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్.