అలా చేస్తేనే.. మేం కాల్పుల విరమణకు ఒప్పుకుంటాం.. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. అటు కీవ్ సైనికులు కూడా రష్యా దూకుడును ఎదుర్కోలేక దేశం వదిలి పారిపోతున్నారు. ఈ పరిణామాల వేళ కాగా, బ్రిటన్ మీడియా సంస్థ ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. కీవ్ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకుంటే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందన్నారు. నేటితో ముగియనున్న…
ఈరోజు (శనివారం) ఉప ముఖ్య కార్య నిర్వాహణాధికారి పూల నర్మద పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ కలెక్టర్ మహబూబాబాద్, గౌరవ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మహబూబాబాద్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోభాల్ తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, ఇంటిలిజెన్స్, కోస్ట్‌గార్డ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ శాఖల ఉన్నతాధికారులు సైతం…
తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు. నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్న బీజేపీ. రేపు జిల్లా స్థాయిలో ఛార్జ్‌షీట్ విడుదల. డిసెంబర్ 2,3న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు. నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్‌లో డీజీపీ-ఐజీపీల సదస్సు.. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్. హాజరుకానున్న పురంధేశ్వరి, కె.లక్ష్మణ్, శివప్రకాష్.…
పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 100 మార్కులతో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ విధానంను వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికయ్యింది.
విద్యుత్తు రంగంలో విధ్వంసానికి ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్ధితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ రోజు బీఆర్ఎస్కు ఎంతో గుర్తు పెట్టుకునే రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరారన్నారు. 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ మా మాట కూడా వినకుండా.. తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వెళ్లారన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్‌ను ఓ పండుగలా జరుపుకుంటుందన్నారు.