అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది.
అవినీతి నిరోధక శాఖకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నికేష్‌కు చెందిన 33 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులను గురించినట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ ,బై బ్యాక్ పాలసీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఒక సైబరాబాద్‌లోనే 22 ఫ్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో సంస్థలు మోసానికి పాల్పడ్డాయి.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, వన్డేలో ప్రపంచ మాజీ నంబర్ 1 బౌలర్ లోన్వాబో త్సోత్సోబే అరెస్టయ్యాడు. ఇతనితో పాటు థమీ సోలెకిలే, ఎథి మభలాటి అరెస్టయ్యారు. మ్యాచ్ జరుగుతుండగానే పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 2015-16 రామ్‌స్లామ్ టీ-20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ క్రికెటర్లపై ఐదు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్లా కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదని.. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి.. మంచి కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బీజేపీ వర్క్ షాప్‌లో కిషన్ రెడ్డి మాట్లాడారు.
ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వైభవ్.. అలీ రజా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.
తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్‌పోర్టును కేంద్రం సస్పెండ్ చేసింది. పాస్‌పోర్ట్ సస్పెండ్‌ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు.
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.