హైదరాబాద్ నగరంలో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు.. స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమేనని పోలీసులు అంటున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా..?
మరోవైపు.. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్‌లో జరిగింది. ప్రమాదవశాత్తు కారు ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఘట్కేసర్ మండలం మేడిపల్లికి చెందిన బంటు రమేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం చర్లపల్లిలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు ఆయన, భార్య, కూతురు ఆధ్యతో కలిసి హాజరు అయ్యారు. సాయంత్రం చిన్నారి ఆద్య ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వేడుకలకు వచ్చిన ఓ బంధువు రివర్స్ చేస్తుండగా కారు ఢీ కొట్టడంతో చిన్నారికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో.. వెంటనే చిన్నారిని ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Off The Record: దీక్షా దివస్ వెనుక BRS అధిష్టానం వ్యూహమేంటి.?