ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 41-28 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో.. టైటాన్స్ విజయాలకు మరోసారి బ్రేక్ పడినట్లు అయింది.
Read Also: Florida: భర్తను చంపి ఆత్మహత్య చేసుకున్న మోడల్ సబ్రినా క్రాస్నికీ
ఫస్టాఫ్ వరకూ తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. అనూహ్యంగా సెకండాఫ్‌లో జైపూర్ రాణించింది. జైపూర్ జట్టులో నీరజ్ నర్వాల్ 12 పాయింట్లతో అదరగొట్టాడు. అతనికి తోడు అర్జున్ దేశ్‌వాల్ 11 పాయింట్లతో రాణించాడు. జైపూర్ టీమ్‌లో అత్యధికంగా 22 పాయింట్లు చేసింది. తెలుగు టైటాన్స్‌కు 19 రైడ్ పాయింట్లు ఉన్నాయి. ట్యాకిల్ పాయింట్స్‌లో జైపూర్ 12 పాయింట్లు ఉన్నాయి. టైటాన్స్‌కు 7 పాయింట్లు ఉన్నాయి. తెలుగు టైటాన్స్ జట్టులో విజయ్ అత్యధికంగా 17 పాయింట్లు చేశాడు. మిగతా ప్లేయర్స్ ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో తెలుగు టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. ఇప్పటి వరకూ ఆడిన 15 మ్యాచ్‌ల్లో 9 గెలువగా, 6 ఓడిపోయింది.
Read Also: Belly fat: రోజూ నిద్రించే ముందు మీ బెడ్‌పైనే ఈ రెండు వ్యాయామాలు చేయండి.. బెల్లీ ఫ్యాట్ తగ్గడం ఖాయం?