ఆసియాలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించిన Amazon..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon: ప్రపంచ ప్రముఖ ఈ-కామర్స్, టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ బెంగళూరులో ఆసియాలోనే రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త కార్పొరేట్ భవనాన్ని కర్ణాటక మంత్రి M.B. పాటిల్ ప్రారంభించారు. ఇప్పటివరకు అమెజాన్ భారత్ లో $40 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగా.. 2030 నాటికి అదనంగా మరో $35 బిలియన్ పెట్టుబడి పీతబొతున్నట్లు ప్రకటించింది.
T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!
Also Read
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ క్యాంపస్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 12 అంతస్తులతో నిర్మించబడిన ఈ భవనం 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 7,000 మందికి పైగా ఉద్యోగులు పని చేసే సౌకర్యం కల్పించబడింది. ఈ కార్యాలయంలో ఈ-కామర్స్, టెక్నాలజీ, ఆపరేషన్స్, పేమెంట్స్, సెల్లర్ సర్వీసెస్ వంటి కీలక విభాగాలు కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.
ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యాలయాన్ని ఆధునిక విధానంలో రూపొందించారు. ఇందులో ఫ్లెక్సిబుల్ వర్క్ స్టేషన్లు, సమావేశ గదులు, చిన్న టీమ్‌ల కోసం హడిల్ స్పేస్‌లు, బ్రేకౌట్ ప్రాంతాలు, 200 మందికి పైగా పాల్గొనగలిగే ఈవెంట్ స్పేస్ లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఉద్యోగుల విశ్రాంతి కోసం ల్యాండ్ స్కేప్ గార్డెన్లు, బాస్కెట్ బాల్, పికిల్ బాల్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. భవనంలో రెండు అంతస్తులు పూర్తిగా క్యాఫెటీరియాలకు కేటాయించి వివిధ దేశాల వంటకాలను అందించేలా రూపొందించారు.
పర్యావరణ పరిరక్షణకు కూడా అమెజాన్ ప్రాధాన్యత ఇచ్చింది. కంపెనీ ‘ది క్లైమేట్ ప్లెడ్జి’ లక్ష్యాల ప్రకారం 2040 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలను సాధించేందుకు కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ కొత్త క్యాంపస్ నిర్మాణంలో పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణ సామగ్రి వినియోగం, పాత కార్యాలయ వనరుల పునర్వినియోగం, ఇంకా అధిక సామర్థ్యం గల ఎనర్జీ సిస్టమ్ లను ఉంచారు.
Karnataka Welcomes Amazon’s 10th Corporate Office as Company Unveils $35 Billion India Expansion
Inaugurated Amazon’s 11 lakh sq. ft. corporate headquarters (BLR 37) at Vinayak Nagar near Yelahanka, Bengaluru. This marks Amazon’s 10th corporate office in Karnataka and reflects… pic.twitter.com/lRfLPi14nk
— M B Patil (@MBPatil) February 23, 2026
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!