ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి ఆగంతకులు కోటి రూపాయలను డిమాండ్ చేశారు. లేడీ వాయిస్‌తో ట్రాప్ చేయించి దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. తుపాకీని తలపై పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు.
తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు.
కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఆ దేశపు రాయబారి రువెన్ అజర్‌కు ఆయన ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో.. నెట్టింట ఫోటోలు వైరల్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారానే విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు.…
సంభాల్ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సంభాల్‌లో గల మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని…
అమరావతి: నేడు సోషల్‌మీడియా కేసులపై విచారణ. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించనున్న హైకోర్టు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి సహా ఇతరుల ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ. కడప: సీఎం వద్దకు చేరిన ఫ్లయాస్ పంచాయతీ. ఇవాళ సీఎంవో ఆఫీస్‌కు రావాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేష్రెడ్డిలకు అధిష్టానం పిలుపు. తెలుగు రాష్ట్రాల్ల నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,340 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు. మంత్రిగా ఏడాదిలోపే మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటుకు కృషి చేశారు.
త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు మొదలు కానున్నాయి.