జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శనివారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ విచారిస్తున్నారు. సమాచారం ప్రకారం.. దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో.. అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు.. స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్లో జరిగింది.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 41-28 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘోర ఓటమిని చవిచూసింది.
పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్ మూడో మ్యాచ్ చైనీస్ తైపీతో జరిగింది. ఒమన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 16-0 తేడాతో తైపీని ఓడించింది. ఈ విజయంతో ఇండియా ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. 3 విజయాలతో భారత్ 9 పాయింట్లు సాధించి పూల్-ఎ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎలక్ట్రిక్ కార్లే నడుస్తున్నాయి. అన్ని రకాల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేస్తున్నాయి. తక్కువ ధర నుంచి మొదలు పెడితే భారీ ధర వరకు ఎలక్ట్రిక్ కార్ల ఉన్నాయి. అందులో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఒకటి భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండనుంది.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయని కార్పొరేటర్లు విమర్శలు గుప్పించారు.
జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. దానిని నియంత్రించడం కోసం ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. జట్టు రాలడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. జుట్టులో రక్త ప్రసరణ లేకపోవడం, చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్. ఈ కారణాల వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారిపోయి.. జుట్టు రాలడం సమస్య పెరిగిపోతుంది. అయితే.. జుట్టు రాలకుండా ఉండేందుకు నిమ్మకాయ రసం అద్భుతంగా పని చేస్తుంది. దీనిని వాడటం వల్ల జుట్టు ఊడటం కంట్రోల్లో ఉంటుంది. నిమ్మరసాన్ని ఆవనూనెలో కలిపి జుట్టుకు అప్లై…
రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు.
గీజర్ పేలి నవ వధువు మరణించిన ఘటన యూపీలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఐదు రోజుల క్రితమే పెళ్లి కాగా.. అత్తగారింటికి వచ్చిన యువతి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. దీంతో.. స్నానం చేసే క్రమంలో గీజర్ పేలి ఆ మహిళ మృతి చెందింది. అయితే.. గీజర్‌ను ఎక్కువగా చలికాలం వాడుతుంటారు. ఈ క్రమంలో వేడి నీళ్లతో స్నానానికి గీజర్ల వాడకం బాగా పెరిగింది. కాగా.. గీజర్‌ను ఉపయోగించే క్రమంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదకరంగా మారుతుంది.…
వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.2,747 కోట్లు విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆధార్ , రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాల సమస్యలు పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.