తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Egg Price Hike: కూరగాయలు మాత్రమే కాదు.. కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది! చుక్కలు చూస్తున్న సామాన్యులు
అయితే.. వారం క్రితం ఇద్దరు ఆదివాసీలను పోలీస్ ఇన్ఫార్మార్ నెపంతో మావోయిస్టులు చంపేశారు. అందుకు ప్రతీకారంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారం తిరగకముందే ఏడుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.. ఆదివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చల్పాక సమీప అటవీ ప్రాంతంలో పోలీసు జవాన్లకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాగా.. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల పేర్లు, వివరాలు వెల్లడయ్యాయి.
1. కుర్సం మంగు @ భద్రు @ పాపన్న.. TSCM, సెక్రటరీ ఇల్లందు – నర్సంపేట AC, AK-47 రైఫిల్.
2. ఈగోలపు మల్లయ్య @ మధు.. DVCM, కార్యదర్శి ఏటూరునాగారం, మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్.
3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM.
4. ముస్సాకి జమున ACM.
5. జైసింగ్, పార్టీ సభ్యుడు.
6. కిషోర్, పార్టీ సభ్యుడు.
7. కామేష్,పార్టీ సభ్యుడు.
Read Also: Morning Breakfast: రుచి, ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలనుకుంటున్నారా..? ఇవి ట్రై చేయండి