మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది.. ఇకపై 100 మార్కుల పేపర్ ఉండనుంది. ఇంటర్నల్ మార్కులను ఎత్తేసింది విద్యాశాఖ. ఇప్పటి వరకూ 80 మార్కులకే పేపర్ ఉండేది.. 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. కాగా.. ఆ పద్ధతిని విద్యాశాఖ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. కేటీఆర్‌కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని.. గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారని కడియం శ్రీహరి చెప్పారు.
సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్‌లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది.
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని తెలిపారు.
హైపర్ మార్ట్ వాల్యూజోన్.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు నాచారంలో సిద్ధమైంది. హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హైపర్ మార్ట్స్తో అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు (నవంబర్ 28)న ప్రారంభించారు.
నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం.. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తామన్నారు.
పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీలు పరిశీలించనున్నాయి.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను.. దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు.