ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఇండియాపై ఆసీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియానే విజయం…
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్‌ను తుపాకీతో కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్నాయి. అందుకు సంబంధించి.. ఈ టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు క్వాలిఫై అయ్యాయి. ఇదిలా ఉంటే.. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు స్థానాన్ని దక్కించుకున్నాయి.