Gun Firing: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్‌ను తుపాకీతో కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పుల్లలపాడు గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్ (60)ను కారులో వచ్చిన దుండగులు అరటిపండ్లు తీసుకోమని పిలిచి తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేసి దుండగులు పరారయ్యారు. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చినట్లు స్థానికిలు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని నల్లజర్ల పోలీసులు వివరాలు సేకరించారు. ఎందుకు, ఎవరు ఈ హత్య చేశారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also: Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది కార్మికులు సురక్షితం..