T20 World Cup: వచ్చే ఏడాదిలో టీ20 వరల్డ్ కప్.. ఇప్పటివరకు ఏ జట్లు క్వాలిఫై అయ్యాయంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్లో జరగనున్నాయి. అందుకు సంబంధించి.. ఈ టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు క్వాలిఫై అయ్యాయి. ఇదిలా ఉంటే.. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్ల హోదాలో వెస్టిండీస్, అమెరికా జట్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నాయి. మరోవైపు నెదర్లాండ్స్ కూడా సాధించిన విజయాల ఆధారంగా ఆటోమేటిగ్గా క్వాలిఫై అయింది.
Read Also: Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?
Also Read
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ఇక.. ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా జట్లు క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గి టీ20 వరల్డ్ కప్-2024కి క్వాలిఫై అయ్యాయి. రేపు క్వాలిఫయింగ్ టోర్నీలో ఉగాండా, కెన్యా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో ఉగాండా విజయం సాధిస్తే ఆ జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ లో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వే జట్టు కూడా టోర్నీలో పాల్గొనేందుకు స్వల్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా అయితే.. ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 20 జట్లతో టీ20 వరల్డ్ కప్-2024 టోర్నీ నిర్వహించనున్నారు.
Read Also: PM Modi: “మానవత్వానికి, సమిష్టి కృషికి నిదర్శనం”.. ఉత్తరాఖండ్ టన్నెట్ రెస్క్యూపై మోడీ..
ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్-2024కు అర్హత పొందిన జట్లు ఇవే…
భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, అమెరికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!