IND vs AUS: ఉత్కంఠభరిత పోరులో భారత్ పరాజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఇండియాపై ఆసీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియానే విజయం వరించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (35), ఆరోన్ హార్డీ (16) పరుగులు చేశారు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన మ్యాక్స్ వెల్ (104) సెంచరీ చేశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక.. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్ దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
Shakeela: మొన్న విచిత్ర.. నేడు షకీలా.. ఆయన నన్ను రూమ్ కు రమ్మన్నాడు
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), రుతురాజ్ గైక్వాడ్ (123) సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ డకౌట్ రూపంలో వెనుతిరగగా.. సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులతో రాణించాడు. చివరలో తిలక్ వర్మ 31 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బౌలర్లలో కానే రిచర్డ్ సన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ సాధించారు. కాగా.. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుపుతో 2-1తో సిరీస్ ఆశలను ఆసీస్ పదిలం చేసుకుంది.
Extra Jabardasth: ‘జబర్దస్త్’ జడ్జ్ మారింది.. ఖుష్బూ స్థానంలో ఆ హీరోయిన్!
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!