Uttarkashi tunnel: ప్రమాదవశాత్తు ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలాగా.. ఈ ఘటనలో 41 మంది కార్మికులు సొరంగం లోపల చిక్కుకుపోయిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే అనేక అడ్డంకులను అధిగమిస్తూ 17 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు నిన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చారు. కాగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయట పడ్డారు. ఇలా కార్మికులందరూ సురక్షితముగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా సంతోషం నిండింది. కాగా కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పైన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలలోకి వెళ్తే.. సొరంగంలో చిక్కున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పైన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. X వేదికగా స్పందించిన ఆయన X లో ఇలా రాసుకొచ్చారు.. సొరంగంలో చిక్కున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు 17 రోజులు పటు విరామం లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. దేశ ప్రజల ఆశలు ఫలించేలా చేసి.. దేశప్రజలకు ఏ క్రీడా విజయం అందించని ఆనందాన్ని మీరు అందించారు. అలానే అందరూ కలిసి ఒకటిగా పని చేస్తే సారాధించలేనిది ఏది లేదని.. బయట పడలేనంత పెద్ద స్వరంగం ఏది ఉండదని నిరూపించారని.. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదులు తెలుపుతున్న అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పలువురు నెటిజన్స్ ఏకీభవిస్తూ కార్మికుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే కడుపు నిండిపోయిందని హర్షం వ్యక్తం చేశారు.