Home
Telugu News
Telugu News News
-
Utter Pradesh: యూపీలో ఘోరం.. బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన అమాయక బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక ముఖం, ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. -
Geetika Koul: తొలిసారిగా సియాచిన్లోని భారత సైన్యానికి మహిళా డాక్టర్ ఎంపిక
భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా కెప్టెన్ డాక్టర్ గీతిక కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన గీతికా కౌల్ రికార్డులకెక్కారు. అక్కడ యుద్ధ పాఠశాలలో కౌల్ కఠినమైన ఇండక్షన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. -
Uttar Pradesh: దొంగతనం చేశాడని యువకుడిని స్తంభానికి కట్టి కొట్టిన స్థానికులు
ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని పోష్ కాలనీలో.. ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణలపై కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అయితే బాధితుడిని కొట్టిన వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Assembly Sessions: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పటిష్ట భద్రత ఏర్పాటు
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి. -
Smriti Irani: భారత్‌లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన.. హజ్ యాత్రపై స్మృతి ఇరానీ చర్చ
సౌదీ అరేబియా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఈరోజు భారత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియాను కలిశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడామన్నారు. అంతేకాకుండా.. హజ్ యాత్రను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించామని తెలిపారు. -
Redmi 13C 5G: మార్కెట్లోకి రెడ్ మీ స్మార్ట్ ఫోన్.. రేపే లాంచ్..!
రెడ్ మీ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు వర్చువల్ ఈవెంట్లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చు. -
Shivraj Singh Chauhan: నేనెప్పుడూ సీఎం రేసులో లేను.. శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు. -
Stock Markets: రికార్డు స్థాయికి చేరుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30… -
Michaung Cyclone: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. చెన్నైలో 12 మంది మృతి
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని… -
Mizoram: మిజోరాం ముఖ్యమంత్రిగా లాల్దుహోమ.. డిసెంబర్ 8న ప్రమాణ స్వీకారం
లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్మెంట్) మిజోరంలో విజయం సాధించింది. 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో అధికార MNF (మిజో నేషనల్ ఫ్రంట్)ను అధికారం నుండి తొలగించి.. జడ్పీఎం అధికారం చేపట్టనుంది. కాగా.. మిజోరాం నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లాల్దుహోమ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!