తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. కొడంగల్, కామారెడ్డిలో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి లీడ్ లో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో 4159 ఓట్లు, కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. రెండో రౌడ్లో గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం ఉంది. మధిరలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.
మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. "హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్" అని ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు.
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని నివారించడానికి మీరు వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో దూరం చేయవచ్చు. అవి లవంగం, యాలకులు.. వీటిని పోషకాల నిధిగా పరిగణించుతారు. లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యాలకుల్లో కూడా.. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్,…
ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు సెప్టెంబర్‌లో 14.9 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చాక నేను ఎక్కడైనా ఒక్క రూపాయి తిన్నానని రామ్మోహన్ నాయుడు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి పంపించ లేదు. ఈ క్రమంలో.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.
త్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.