తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని 40 స్థానాల్లోపే పరిమిత చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేయగా.. చాలా నియోజకవర్గాల్లో మహిళలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులెవరో తెలుసుకుందాం..
సంగారెడ్డిలో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. సంగారెడ్డి ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారని.. తనకు ఓట్లు వేసిన 65 వేల మందికి.. అలాగే తనకు ఓట్లు వేయని 71వేల మందికి జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి ప్రజలు తనకు కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.
పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆశించిన ఫలితం రాలేదన్న ఆయన.. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామన్నారు. 39 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషించాలని ప్రజలు చెప్పారని.. ప్రజలు అందించిన తీర్పును శిరసావహిస్తామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరైపోయాయి.
ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. కాన్వాయ్ లేకుండానే ప్రగతి భవన్ నుంచి రాజ్‌భవన్‌కు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిది.. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ పని చేస్తూనే ఉంటుందని ప్రధాని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని అన్నారు. కాగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందని, దానిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకున్నారు. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నామన్నారు. తనపై గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.