సౌదీ అరేబియా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఈరోజు భారత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియాను కలిశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడామన్నారు. అంతేకాకుండా.. హజ్ యాత్రను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించామని తెలిపారు.
INDIA bloc: ఇండియా కూటమి మీటింగ్ తేదీ ఖరారు.. వెల్లడించిన లాలూ..
అంతేకాకుండా.. అంగన్‌వాడీ కేంద్రాలు ఎలా హైటెక్‌గా మారుతున్నాయో, టెక్నాలజీ ఎలా పనిని సులభతరం చేసిందో స్మృతి ఇరానీ వివరించారు. సాంప్రదాయ బొమ్మలు, లాలిపాటల ద్వారా చిన్న పిల్లలకు విద్యాబోధన చేయడం ఎందుకు ముఖ్యమో.. స్మృతి ఇరానీ తెలిపారు. సాంకేతికత, భారతీయ సంప్రదాయం సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలను తీర్చిదిద్దుతున్నాయని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. మరోవైపు.. హజ్ 2023ను విజయవంతం చేసినందుకు సౌదీ అరేబియాకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ కృతజ్ఞతలు తెలిపారు. హజ్ 2024ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారతదేశ పర్యటన ముఖ్యమని ఆయన అన్నారు.
Aata Sandeep: యానిమల్ లో రణబీర్ ఎంట్రీ.. ఆ స్టెప్స్ నేనే నేర్పించా
కాగా.. తాను ఇండియా పర్యటన సందర్భంగా సాదర స్వాగతం పలికినందుకు అల్-రబియా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియా చాలా చేసిందని అన్నారు. 48 గంటల్లో వీసా పొందవచ్చని.. ఉమ్రా వీసా 90 రోజులు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. మరో 3 వీసా కేంద్రాలపై చర్చ జరిగిందని.. అంతేకాకుండా తాము సవాళ్లను అధిగమించడం గురించి చర్చించాము.. విమానాల పెంపుపై కూడా దృష్టి సారించామన్నారు. హజ్ యాత్రపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఇప్పటికే హజ్ 2024 విధానాన్ని సమర్పించిందని, హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులందరికీ దరఖాస్తు ఫారమ్ అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం హాజీలలో 47% మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.