Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venky Atluri: స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సినిమాకు అండగా నిలిచిన ప్రేక్షకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం యాక్షన్, డార్క్ కామెడీ, హారర్, డివైన్ ఇంటర్వెన్షన్ వంటి జానర్లు ట్రెండ్ అవుతున్న సమయంలో తాను ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై కొందరు తనను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినా.. నిర్మాత నాగవంశీ మాత్రం తనకు పూర్తి మద్దతు ఇచ్చారని చెప్పారు.
‘‘ఈ సబ్జెక్ట్‌ను మొదట రాసినప్పుడు ట్రెండ్ వేరేలా ఉంది. యాక్షన్, డార్క్ హ్యూమర్, హారర్ వంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి సమయంలో ఫ్యామిలీ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు చాలామంది డిస్కరేజ్ చేశారు. కానీ వంశీ గారు నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు’’ అని వెంకీ అట్లూరి పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత వస్తున్న స్పందనపై కూడా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాక్సాఫీస్ వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు భారీగా జంప్ అవుతున్నాయని చెప్పారు. ‘‘30 శాతం, 40 శాతం జంప్స్ వింటుంటాం.. కానీ 100 శాతం జంప్ కావడం నేను తొలిసారి వింటున్నాను’’ అంటూ వెంకీ అట్లూరి హర్షం వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్‌లో ప్రేక్షకుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘‘ఈ సినిమాను మీ భుజాలపై మోసుకుని తీసుకెళ్లారు. మీ ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. నా కుటుంబానికి అన్నం పెట్టే స్థాయిలో నన్ను నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్యూ’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే హీరో సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, సునీల్, హర్ష, వెంకట్ మాస్టర్ తదితరుల సహకారాన్ని వెంకీ అట్లూరి ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సూర్య నటన, రవీనా టాండన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!