Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
- ఉద్యోగాల లెక్కలపై సీఎంకు సూటి ప్రశ్నలు
- రుణమాఫీపై గన్‌పార్క్‌కు రావాలంటూ సవాల్
- ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కోర్టుకే: హరీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అభివృద్ధి , ప్రగతి గురించి మాట్లాడాల్సింది పోయి, రేవంత్ రెడ్డి అసత్యాలు, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారని హరీష్ రావు ధ్వజమెత్తారు. నాటి కేసీఆర్ పాలనలో ఆగస్టు 15న రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించేవారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రోత మాటలతో వేదికను దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల తరహాలోనే సీఎం వ్యాఖ్యలన్నీ 420 మాటల్లాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
జిల్లా అభివృద్ధి ఎక్కడ? ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సింగూరు ప్రాజెక్టు ఎండిపోయి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు నీళ్లు లేని పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా భవిష్యత్తు కోసం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. గతంలో జహీరాబాద్ వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని, నియోజకవర్గంలో కనీసం ఒక కిలోమీటర్ రోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రేషన్ బియ్యాన్ని 4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచిన విషయాన్ని పక్కన పెట్టి, బియ్యం పంపిణీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Also Read
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
ఉద్యోగాలు, రైతు బంధుపై సీఎంకు ఓపెన్ ఛాలెంజ్
ఉద్యోగాల భర్తీ, రైతుల సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రత్యక్ష సవాళ్లు విసిరారు. అసెంబ్లీ సాక్షిగా 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, ఇప్పుడు సభల్లో 70 వేల ఉద్యోగాలు అని ఎలా అబద్ధాలు చెబుతారని నిలదీశారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ, దిల్ సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లు లేదా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులను ఎదుర్కోవాలని సవాల్ చేశారు. అలాగే, రైతు బంధు సాయం కేసీఆర్ ఇచ్చిన దానికంటే తక్కువగా ఇచ్చారని ఆరోపిస్తూ… ఈ అంశంపై చర్చించేందుకు గన్ పార్క్ వద్దకు రావాలని, తప్పు తేలితే మూక్కు నేలకు రాయడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసిరారు.
రుణమాఫీ నాటకాలు, కరెంట్ కోతలపై నిలదీత
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పచ్చి అబద్ధాలని హరీష్ రావు కొట్టిపారేశారు. రుణమాఫీకి రూ. 35 వేల కోట్లు కేటాయించామని చెప్పి, ఆచరణలో చేసింది రూ. 20 వేల కోట్లు మాత్రమేనని ఆరోపించారు. “రుణమాఫీ పూర్తయిందని నిరూపించడానికి సీఎం సొంత ఊరికి వెళ్దాం, అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను రాజీనామా చేస్తా.. లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా?” అని సవాల్ విసిరారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలకు మించి త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదని, విద్యుత్ కోసం రైతులు సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారన్నారు.
‘న్యాయపోరాటం చేస్తాం.. రేవంత్‌ను కోర్టుకు ఈడుస్తాం!’
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, దోపిడీల గురించి వారి సొంత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారని హరీష్ రావు గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలను సహించేది లేదని, సీఎంను నిరూపణ కోసం ఖచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి భయపడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హరీష్ రావు తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!