మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు. అంతేకాకుండా.. ప్రధాని మోదీతో కలిసి పనిచేసే అవకాశం లభించడం అదృష్టమని, ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో ఉజ్వలమైన, సంపన్నమైన, శక్తిమంతమైన భారతదేశం నిర్మితమవుతోందని ఆయన తెలిపారు.
India Bloc: ఇండియా కూటమి భేటీ.. కాంగ్రెస్ పిలుపుకు కీలక నేతలు గైర్హాజరు..
మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 163 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. 2018లో కాంగ్రెస్.. 114 సీట్లను సాధించగా, ఈసారి చాలా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే.. సీఎం అభ్యర్థి అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ముఖచిత్రంగా చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు.
Stock Markets: రికార్డు స్థాయికి చేరుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
కాగా.. సీఎం రేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా.. సీఎం శివరాజ్ సింగ్‌కు కాకుండా వేరే వ్యక్తిగా సీఎం పదవి ఇస్తారని కొంత ప్రచారం జరుగుతుండగా.. కొందరు శివరాజ్ సింగ్‌నే సీఎంగా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు.. సీఎం పదవిపై శివరాజ్ సింగ్ స్పందించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.