రాజస్థాన్లోని కోట్పుత్లీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. బోరుబావి 700 అడుగుల లోతు ఉంది. మొదట్లో దాదాపు 15 అడుగుల లోతులో ఉన్న బాలిక ఒక్కసారిగా జారి కిందకు వెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భూపేంద్ర చౌదరి కుమార్తె చేతనా చౌదరి ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కాలు జారి తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
వెల్లుల్లి ఒక సహజ ఔషధం. వెల్లుల్లిని సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని ఆహార పదార్థాల్లో రుచి కోసం వాడుతారు. ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల రుచితో పాటు వాసనను తగ్గిస్తుంది.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు క్రీడావర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనుభాకర్ పేరు తొలగించినట్లు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది.
బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా బడ్జెట్లో 35 శాతం ప్రకటించి ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీయమనేదంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ను కూడా కలిశాడు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కర్నాటకలోని ఉడిపిలో టైరు పగిలి మెకానిక్ గాల్లోకి ఎగిరిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఉన్న టైర్ షాప్ మెకానిక్ స్కూల్ బస్సు టైర్ని పంచర్ వేసి గాలి నింపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టైరు పేలింది. దీంతో.. అక్కడే ఉన్న మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ క్రమంలో మెకానిక్ అబ్దుల్ రజీద్ (19)కు గాయాలయ్యాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఈ నెల 26 నుంచి ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా బాక్సింగ్ డే టెస్టు ఆడనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. అయితే.. బాక్సింగ్ డే టెస్టు విషయానికొస్తే.. భారత్ రికార్డు చెప్పుకోదగినంత లేదు.. ఆస్ట్రేలియా రికార్డు అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర…
ఇటీవలే కియా సిరోస్ (Kia Syros EV) ఇండియాకు వచ్చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ కియా సిరోస్ ఈవీ కూడా తర్వలో లాంచ్ కానుంది. 2026 నాటికి ఇండియాలో ప్రారంభించనున్నారు.
ఐకియా వాహనంలో గంజాయి సరఫరాపై ఐకియా యాజమాన్యం స్పందించింది. తమ వాహనాల్లో మత్తు పదార్థాలను తరలించడాన్ని తీవ్రంగా ఖండించింది. తమ కంపెనీ ఫర్నీచర్ హోం డెలివరీ చేసే ప్రక్రియ థర్డ్ పార్టీ వెండర్ ఆధీనంలో జరుగుతుందని ఐకియా క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపింది.
చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు! పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న…