పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు క్రీడావర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనుభాకర్ పేరు తొలగించినట్లు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మనుబాకర్ పేరు లేదని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెబుతోంది.
Read Also: Minister Thummala: బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు.. మంత్రి మండిపాటు
ఈ క్రమంలో మను తండ్రి స్పందించారు. అది వాస్తవమని, క్రీడా అత్యున్నత పురస్కారం కోసం తాము అప్లికేషన్ పంపినట్లు ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. 12 మందితో కూడిన జాతీయ స్పోర్ట్స్ డే కమిటీ మాత్రం మనుబాకర్‌కు అవకాశం ఇవ్వనట్లు తెలుస్తోంది. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్స్ సాధించడంలో అర్ధమేముందని ప్రశ్నించారు. కాగా.. మనబాకర్‌కు 2020లో అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే.. ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన వారిలో హాకీ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
Read Also: AUS vs IND: అశ్విన్ స్థానంలో యువ క్రికెటర్ ఎంపిక.. స్క్వాడ్‌లో చేరనున్న అన్‌క్యాప్డ్ స్పిన్నర్