Health: వెల్లుల్లిని ఆహారంలో కాకుండా ఇలా తినండి.. రోగాలకు చెక్ పెట్టండి
- వెల్లుల్లి సహజ ఔషధం
- సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది
- వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు
- వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెల్లుల్లి ఒక సహజ ఔషధం. వెల్లుల్లిని సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని ఆహార పదార్థాల్లో రుచి కోసం వాడుతారు. ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల రుచితో పాటు వాసనను తగ్గిస్తుంది. వెల్లుల్లిని ఊరగాయలు, చట్నీలకు కూడా ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేద, ఔషధ గుణాలకు శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే.. వెల్లుల్లితో జలుబు, దగ్గు తగ్గించవచ్చు. అధిక బీపీ ఉన్నవారు రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే.. వారి బీపీని సులువుగా నార్మల్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో వెల్లుల్లి ఔషధంలా పనిచేస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో కాకుండా.. నెయ్యిలో కాల్చుకుని తింటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నెయ్యిలో కాల్చిన వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
Read Also: CM Chandrababu: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకే 34 శాతం.. సీఎం కీలక వ్యాఖ్యలు..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే గౌట్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. గ్యాస్, అసిడిటీ , అజీర్ణం వంటివి నివారిస్తుంది. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. కాల్చిన వెల్లుల్లి గుండె ధమనులను శుభ్రంగా, ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.
కీళ్ల నొప్పులు అదుపులో ఉంటాయి:
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే కీళ్ల నొప్పులు అదుపులో ఉంటాయి. వెల్లుల్లి, నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను నియంత్రిస్తాయి. వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిలాగే నెయ్యి కూడా మంటను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌కు నెయ్యి, వెల్లుల్లి కలయిక దివ్యౌషధం.
శక్తి స్థాయిలు మెరుగుపడతాయి:
వెల్లుల్లి, నెయ్యి కలయిక శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. నెయ్యి ఒక అద్భుతమైన శక్తి వనరు.. వెల్లుల్లితో కలిపి తినడం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల బలహీనత, అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!