బీసీసీఐ నిర్వహిస్తున్న పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో యువ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రాంచీలోని మెకాన్ స్టేడియంలో జరిగిన 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లో ఢిల్లీ అండర్-23 జట్టు 8 వికెట్ల తేడాతో కేరళ అండర్-23పై విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు రౌనక్ బఘేలా ధాటికి 25.4 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ రౌనక్ బఘేలా 7.4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి కేవలం 21 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుత ప్రదర్శతో కేరళ జట్టు కుప్పకూలింది. అనంతరం 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. ఆయుష్ దోసెజా (59), అర్పిత్ రాణా (38) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కేవలం 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రౌనక్ బఘేలా అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
రౌనక్ బఘేలా బౌలింగ్ పట్ల అతని కోచ్ దేవదత్ బాఘెల్ మాట్లాడుతూ.. అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించాడు. అతను అద్భుతమైన బౌలర్ అని చెప్పాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఈ ఆటగాడు.. తన కృషి, అంకితభావంలో ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదని అన్నాడు. అతను ఢిల్లీకి చెందిన రవీంద్ర జడేజా అని కోచ్ చెప్పాడు. రౌనక్ బఘేలా బ్యాట్, బాల్ రెండింటిలోనూ బాగా రాణిస్తున్నాడు. మరోవైపు.. సమీర్ రిజ్వీ ఇటీవల డబుల్ సెంచరీ సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. త్రిపురతో జరిగిన పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉన్న రిజ్వీ కేవలం 97 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 20 సిక్సర్లు ఉన్నాయి. రిజ్వీ తన ఇన్నింగ్స్‌తో రికార్డులను బద్దలు కొట్టాడు. సమీర్ రిజ్వీ అద్భుత ఆటతీరుతో ఉత్తరప్రదేశ్ త్రిపురను భారీ తేడాతో ఓడించింది.
Read Also: Central Minister Rammohan Naidu: శరవేగంగా పనులు. జూన్ 2026కే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి..