ఒంగోలు సమీపంలో టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం మహానాడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటే వైసీపీకి కడుపు మంటగా ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక గడపగడపకు వెళితే జనం మొహం మీద కొడుతున్నారని ఎద్దేవా చేశారు. MLA…
పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా.. గెలుపుపై గ్యారంటీ ఉన్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఎన్నికల్లో ఆయన ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా.. ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా గెలుపు సొంతం చేసుకుంటారు. వైసీపీ ప్రభంజనం సృష్టించిన 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత గంటా…
కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. సోమవారం నాడు విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి బూత్ లెవల్ వరకు పటిష్టంగా ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వాలంటీర్ల…
దావోస్ వేదికగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సదస్సుకు ఏపీ సీఎం జగన్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కూడా ఈ సదస్సుకు హాజరైనట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దావోస్‌లోని ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరైనట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో కలిసి…
ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని మంత్రి జోగి రమేష్ ఖండించారు. టీడీపీ విధానాలు చూసి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి పనికిమాలిన వాళ్లను 14 ఏళ్లు ఎలా భరించామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్లటం నేరమా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ దావోస్‌కు వెళ్లడం టీడీపీ…
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా మారింది. సీబీఐ కోర్టుకు జగన్ ముందుగా చెప్పినట్లు నేరుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వెళ్లకుండా లండన్‌లో ల్యాండ్ కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ అంశాన్ని టీడీపీ వదిలిపెట్టడం లేదు. దండుకున్న అవినీతి సంపదను దాచుకోవడానికే జగన్ లండన్ వెళ్లారని శనివారం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత పట్టాభి కూడా జగన్ లండన్ టూర్‌పై విమర్శల వర్షం…
కర్నూలు జిల్లా పర్యటనలో ఓర్వకల్లులోని రాక్ గార్డెన్‌ను మంత్రి రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం, పిక్నిక్ స్థలాలు, వసతి కోసం హరిత రిసార్టు పర్యాటకులకు అందిస్తున్నామన్నారు. ఇది పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. మరోవైపు ప్రతిపక్షం టీడీపీపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చకామెర్లు ఉన్నాయని.. అందుకే ఆయనకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రోజా సెటైర్ వేశారు.…
ఏపీలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ క్రాప్ నమోదు పేరుతో జగన్ సర్కారు రైతులను దారుణంగా దోచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది రైతులను దోచుకుంటున్న ప్రభుత్వం అని.. అన్నదాతల ఆగ్రహానికి సీఎం జగన్ బలికాక తప్పదని ఆలపాటి రాజా హెచ్చరించారు. భూమి, పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 శాతం భూమికి…
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడులో ముఖ్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో…
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జగన్ దావోస్ వెళ్లారని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అయితే సీఎం జగన్ దావోస్ వెళ్లలేదని నేరుగా లండన్ వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపీకి, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందని.. కనీస విలువలను పాటించాలన్న స్పృహ…