టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు.…
సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉద్రిక్తంగా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. రెండు వారాల క్రితం హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో…
ఒంగోలు సమీపంలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు మహానాడు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీ ఫుడ్ మెనూ సిద్ధం చేసింది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఆహార కమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వెయ్యి మంది నిష్ణాతులైన వారు మహానాడు ప్రాంగణంలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు…
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వైసీపీ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను హతమార్చేందుకు ఇప్పటికే రెండు సార్లు ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో చనిపోయేవాడినని చింతమనేని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. Three Gorges…
ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. ఈ మేరకు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడును అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఉదయం 10:15 గంటలకు వేదికపై మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. కాగా మహానాడు…
టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు. మహానాడు కార్యక్రమానికి వెళ్లే వాహనాల మార్గాలు: ★ గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్‌లో ఎంటర్ అయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా…
శుక్రవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఒంగోలు సమీపంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ సర్వం సిద్ధం చేసింది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఒంగోలు చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఆయన…
అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారన్నారు. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని…
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే అందరికీ టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తొస్తారు. ముంబై లేదా బెంగళూరులో ఏర్పాటు అవుతుందనుకున్న ఐఎస్బీని చంద్రబాబు హైదరాబాద్ తీసుకువచ్చారు. 2001లో టీడీపీ హయాంలోనే ఐఎస్బీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఐఎస్బీ 20వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఐఎస్బీ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వరుసగా 17…