Telugu Desam Party: మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై టీడీపీ కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడులో ముఖ్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రంపై మహానాడులో స్పష్టమైన సంకేతాలను టీడీపీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా జాగ్రత్తపడతామంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన ప్రకటనకు కొంచెం అటు ఇటుగానే టీడీపీ రాజకీయ తీర్మానం చేసే అవకాశముంది. అటు బీజేపీ విషయంలో మహానాడులో టీడీపీ ఎలాంటి ప్రస్తావన చేయబోతుందో వేచి చూడాలి. రాష్ట్రానికి ఏది మంచిదైతే అదే నిర్ణయం తీసుకుంటామని, బీసీల విషయంలో మహానాడులో ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
పొత్తులనేవి ఏదో కొత్త వ్యవహరం అన్నట్టు వైసీపీ మాట్లాడుతోందని.. ఒంటరిగా పోటీ చేయాలా లేదా పొత్తు పెట్టుకోవాలా అనేది తాము అంతర్గతంగా తీసుకునే నిర్ణయమని ఆయన తెలిపారు. మహానాడులో తీర్మానాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు.. గాలి పార్టీ అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తమ దగ్గర నుంచి వెళ్లిన బీసీలకే రాజ్యసభ పదవులు ఇచ్చారని.. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదా అని ఆయన ప్రశ్నించారు. రెండు రాజ్యసభ స్థానాలను తన పర్సనల్ వ్యవహారాలు చూసే వారికి జగన్ కేటాయించడం సిగ్గుచేటన్నారు.
Tadipatri: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం
2014లో 103 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే.. తొమ్మిది మంది బీసీలకు మంత్రి పదవులిచ్చామని వైసీపీ నేతలు గుర్తించాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు. 151 స్థానాలు గెలిచిన వైసీపీ కేవలం 10 మంది బీసీలకే పదవులు ఇచ్చిందని ఆరోపించారు. టీడీపీ-బీసీల మధ్య ఉన్నది కాంక్రీట్ బంధం అని అభివర్ణించారు. మహానాడు వేదికకు పర్మిషన్ ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ కార్యకర్తలు బాగా ఛార్జ్ అయ్యారని.. గేర్ మార్చారని అచ్చెన్నాయుడు తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించే విధంగా ఒంగోలులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒంగోలు సమీపంలోని గ్రామస్థుల సహకారంతో మహానాడు వేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!