ఏపీలో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని వంగలపూడి అనిత ఆరోపించారు. జగన్ ఏపీలోని అక్క చెల్లెమ్మలతో ఓట్లు వేయించుకుని సీఎం అయ్యాక అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలకు ఎల్లప్పుడూ కామాయేనా.. ఫుల్‌స్టాప్…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా నారాయణ అరెస్ట్ అంశంపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పందించారు. ఏపీలో పాశవిక పాలన నడుస్తోందంటూ ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగానే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు. అయితే తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఎంతో కాలం నిలబడవని గోరంట్ల బుచ్చయ్య చౌదరి…
ఏపీలో కడప జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా జగన్ ప్రచారం చేయించుకున్నారని.. సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే గన్ ఎక్కడా? జగన్ ఎక్కడా? అని లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. Crime…
పొత్తుల విషయంలో వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తూ టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేయడం తెలియదని, పొత్తు లేకపోతే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరని ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో వైసీపీ నేతల కామెంట్లపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైసీపీ పక్కన నిలబడేందుకు ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదని వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం…
ఏపీలో ప్రస్తుతం పొత్తుల రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది. కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ మంత్రులు, కీలక నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు సొంత పార్టీపై నమ్మకం లేదని బాలినేని విమర్శించారు. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.…
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు నిద్రపట్టక పిచ్చివాగుడు వాగుతున్నారని.. దుర్మార్గులను బంగాళాఖాతంలో కలపాలంటే చంద్రబాబు పొత్తుల గుర్చి మాట్లాడుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో జగన్, వైసీపీ నేతలకు కింద తడవడం ప్రారంభమైందని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీకి వెన్నులో వణుకు…
ఏపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ పాకుడు మెట్ల మీద ఉన్నారని.. ప్రతిరోజూ ఆయన కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అని ప్రజలే నినాదాలిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు టూర్ మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిందని.. ఏపీ ప్రభుత్వం ఛార్జీలతో విపరీతంగా బాదేస్తుందని ప్రజలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఓ చేత్తో డబ్బులు…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా ఉరందూరులో 1949, ఏప్రిల్ 15న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మించారు. ఆయన తండ్రి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే గంగా సుబ్బరామిరెడ్డి వారసుడిగా 1989లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా ఐదుసార్లు…
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో కోరారు. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు అభ్యర్థులు సిద్ధంగా లేరని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం…