VijayaSaireddy: టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా సోషల్ మీడియాలో మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా మొన్న అచ్చన్న.. నిన్న స్వయంగా చంద్రబాబే ‘పార్టీ లేదు-బొక్కాలేదు’ అన్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోజురోజుకూ టీడీపీ నిర్వీర్యం అయిపోతోందని చంద్రం అన్నయ్యే తేల్చేశాడని చురకలు అంటించారు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా.. పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం…
Payyavula Keshav: ఏపీ కేబినెట్ సమావేశంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం…
Ambati Rambabu: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని.. వాలంటీర్లు హత్యలు, అత్యాచారాలు, మోసాలు, అనేక ఘోరాలు చేస్తున్నారని టీడీపీ మీడియాలో రాస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజలకు పాలనను ప్రజల గుమ్మం వరకు వెళ్ళి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ఇలా తప్పుడు కథనాలను టీడీపీ నేతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పనికి రేటు పెట్టి మరీ…
Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పరిపాలన ప్రభావం వల్లే రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో 1623 మండలాలను కరువుగా ప్రకటించారని ఎద్దేవా…
AP BJP: తాను అధికారంలోకి వస్తే వడ్డీతో సహా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్లపై బీజేపీ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేసింది. అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారిమళ్లించి ఏపీని సీఎం జగన్ 90 శాతం నాశనం చేస్తే తాను 100 శాతం నాశనం చేస్తానని మాజీ సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అని బీజేపీ ట్వీట్ చేసింది.…
Kollu Ravindra: టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా సీఎం జగన్ అవమానించారని ఆరోపించారు. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే కానీ బ్యాక్ బోన్ కాదన్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ బహిరంగంగా ప్రకటించారని.. పెద్ద పీట వేయడమంటే నిల్చోబెట్టి అవమానించడమేనా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని..…
Chandra Babu: గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముస్లిం మైనారిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రి పదవులు పొందాలంటే 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదని, ప్రభుత్వ సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదని.. దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దుల్హన్ పథకాన్ని తీసుకువస్తానని..…
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్‌ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబు తొక్కేస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని నారా లోకేష్‌ను అందలెక్కించడం ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని పరోక్షంగా ఆరోపించారు. అలాగే ఏపీని ఆక్రమించాలని ఓ కులం పన్నాగాలు…
Telugu Desam Party: ఏపీ సీఎం జగన్‌కు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగలేఖ రాశారు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యధేచ్ఛగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని ఎమ్మెల్యే అనగాని తన లేఖలో ప్రస్తావించారు. జూద కేంద్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని గుర్తుచేశారు. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.…
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను మోసం చేశాడు కాబట్టే.. చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి శాపం పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు వయసులో ఉన్న జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి మానసికంగా చంద్రబాబు క్షోభ పడేలా దేవుడు చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడని.. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని పేర్ని నాని…