VijayaSai Reddy: చంద్రబాబుకు కాలం చెల్లింది.. రాష్ట్రం నవ్యాంధ్ర కాబోతోంది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VijayaSai Reddy: వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఓడిస్తే అవే తనకు చివరి ఎన్నికలంటూ కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. తనకు కాలం చెల్లిందని చంద్రబాబు స్వయంగా అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేర్పిన నిఖార్సైన నిజమని.. ఇప్పుడు చంద్రబాబు తుప్పు అని.. కాదు కాదు వృద్ధ నారీవ్రత, సతివ్రత కూడా అని చురకలు అంటించారు. అందుకే రాష్ట్రం నవ్యాంధ్ర కాబోతుందని విజయసాయిరెడ్డి అన్నారు.
తనకు కాలం చెల్లిందని మా అన్నయ్య చంద్రబాబు స్వయంగా గ్రహించడం/అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేర్పిన నిఖార్సైన నిజం. ఇప్పుడు ఆయన తుప్పు…కాదు కాదు వృద్ద నారీ పతివ్రత/సతివ్రత కూడా! అందుకే రాష్ట్రం నవ్య ఆంధ్ర కాబోతుంది.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 18, 2022
మరో ట్వీట్‌లో ‘టాటా.. టాటా.. వీడుకోలు.. గుడ్ బై.. చంద్రం అన్నయ్యా. నాకు ఏడుపొస్తుందన్నయ్యా.. నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందా? మమ్మల్ని ఇలా వదిలేసి విశ్రాంతి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావన్నయ్యా ఈ నిర్ణయం?’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
టాటా…టాటా…వీడుకోలు….గుడ్ బై…చంద్రం అన్నయ్యా. నాకు ఏడుపొస్తుందన్నయ్యా! నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందా? మమ్మల్ని ఇలా వదిలేసి విశ్రాంతి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావన్నయ్యా ఈ నిర్ణయం? pic.twitter.com/HWDIxPQpIn
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2022
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!