actor harassing wife: అతను రీల్ హీరో.. రియల్‌లో మాత్రం విలన్. యస్ మీరు విన్నది కరెక్టే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటూ.. హీరోగా ఎదుగుతున్న వ్యక్తి ఇప్పుడు తనలోని విలనిజాన్ని బయట పెట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంచాయితీ కాస్తా రచ్చకెక్కింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ధర్మ మహేష్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోగా రాణిస్తున్నాడు. కానీ…
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఒక అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకు మరే హీరో ఆ రికార్డు బద్దలు కొట్టలేకపోయారంటే, ఆయన నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ రికార్డు ఏంటంటే, ఇప్పటివరకు ఏ ఒక్క కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లోనూ నటించని ఏకైక స్టార్ హీరోగా రజనీకాంత్ ఘనత అందుకున్నారు. ఏ కంపెనీ వారైనా ఎన్ని కోట్లు ఇస్తామన్నా సరే, “నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు నన్ను ఫాలో అయ్యే వారు గుడ్డిగా. మాస్టారు, ఆ తర్వాత…
తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 18, 2025) చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి…
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఎంత పెద్ద ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, అప్పట్లోనే సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అన్నట్టుగానే, ప్రస్తుతానికి అఖండ 2 సినిమాకి సంబంధించిన సీక్వెల్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 25వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు భావించారు.…
కిరణ్ అబ్బవరం, మినిమం గ్యారంటీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూ, క సినిమాతో హిట్ అందుకుని, కొంతవరకు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత, తన ఎంపికల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే, ఇప్పటికే ‘కే రాంప్’ అనే ఒక సినిమాతో పాటు, ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మరో సినిమాని పట్టాలెక్కించాడు. ఇక, ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే, కిరణ్ అబ్బవరం…
ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. Also Read:Harinya Reddy: బిగ్ బాస్ కీలక టీం మెంబర్, ప్రొడ్యూసర్.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి షాకింగ్ బ్యాక్ గ్రౌండ్ ఇక, కొద్దిసేపటి క్రితమే…
రాహుల్ సిప్లిగంజ్ నిన్న సీక్రెట్‌గా తన సుదీర్ఘ కాలపు ప్రేయసి హరిణ్య రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే, ఆమె ఒక పొలిటీషియన్ కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. అయితే, అసలు ఆమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయగా, కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పేరు హరిణ్య రెడ్డి, యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ కాలేజీలో బి.ఎ. మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చదివారు. తర్వాత, బిగ్ బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా కంపెనీలో…
మొన్న ఆగస్టు 14వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలు బాలేదా అంటే, బాలేదని చెప్పలేం, ఓ మాదిరిగా ఉన్నాయి. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను ఈ సినిమాలు మెప్పించలేకపోయాయి. అయితే, సినిమా కథనం విషయం ఎలా ఉన్నా, రెండు సినిమాల విషయంలోనూ మేకింగ్ కీలక పాత్ర పోషించింది. మేకింగ్…
తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.…