Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Naga Vamsi: మీనాక్షి నా బుర్ర తినేసేది.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
Naga Vamsi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న ‘అనగనగా ఒక రాజు’లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది… -
Peddi vs Paradise : ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సప్పుడు లేదేంటి? రిలీజ్ ఉన్నట్టా, లేనట్టా?
టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ.. అనేక అంచనాలు ఏర్పరుచుకున్న ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సినిమాల పరిస్థితి ఏంటి? అని, నిజానికి ఈ రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గరపడుతోందంటే, కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాను నిద్ర పోనివ్వరు, కానీ ప్రస్తుతం… -
SV Krishna Reddy: తెలుగబ్బాయి హీరోగా సౌత్ కొరియా హీరోయిన్
తెలుగు చిత్ర పరిశ్రమలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, తన 43వ చిత్రంగా ‘వేదవ్యాస్’ అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో, సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాత అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న పిడుగు విశ్వనాథ్‌ను చిత్ర బృందం ఘనంగా పరిచయం చేసింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల… -
Vishwambhara : ‘విశ్వంభర’పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు..
మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమా ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, చిరంజీవి ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమాలోని భారీ… -
AA Loki: బన్నీ – లోకి.. LCU అయితే ఇక ఆపే వాడే లేడు!!
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది, అదే “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేతులు కలపబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్మెంట్ రావడంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీగా మార్చే అంశం ఏమిటంటే, ఇందులో మ్యూజిక్… -
Mahesh Babu: మీకోసం ఆరోజే తలుపులు తెరుస్తున్నాం.. మహేష్ బాబు కీలక ప్రకటన
బెంగళూరు సినీ ప్రియులకు మహేష్ బాబు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న AMB సినిమాస్ ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘AMB సినిమాస్’ ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులో అడుగుపెడుతోంది, జనవరి 16వ తేదీన ఈ గ్రాండ్ మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం తలుపులు తీయనుంది. ఇది కేవలం ఒక మల్టీప్లెక్స్ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన సాంకేతిక విప్లవం, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా… -
Mana Shankara Varaprasad Garu : చిరంజీవి సినిమాకు ఇళయరాజా టెన్షన్? అనిల్ రావిపూడి క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయిస్తోంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. అయితే, ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన ‘దళపతి’ చిత్రంలోని సాంగ్ బిట్‌ను వాడటంతో కాపీరైట్ ఇబ్బందులు వస్తాయేమోనని… -
MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయిన తర్వాత, నిర్మాత సాహు గారపాటి అనిల్ రావిపూడికి అత్యంత విలువైన టయోటా వెల్ఫైర్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లోనే మరోసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా నటించిన సినిమాలో వెంకీ మామ మరో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా… -
Chiranjeevi – Anil Ravipudi: బ్లాక్ బస్టర్ వరప్రసాద్.. మెగా హగ్ వైరల్
Chiranjeevi – Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోకు.. కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు అనే… -
Vijay Deverakonda : నిద్రలేని రాత్రులు గడిపా.. ఇన్నాళ్లకు న్యాయం జరిగింది
ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యిందో లేదో.. వెంటనే ఫోన్ తీసి రేటింగ్స్ చూసేస్తున్నాం. సినిమా బాగుందా లేదా అని తెలుసుకోవడం మంచిదే కానీ, ఈ రివ్యూలే ఇప్పుడు సినిమాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక సినిమా కోసం కొన్ని వందల మంది పడే కష్టాన్ని కేవలం ఒక స్టార్ రేటింగ్‌తో తేల్చేస్తున్నారు. దీనివల్ల అసలు సినిమా బాగున్నా కూడా జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. దీని పై హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!