మాస్ మహారాజా రవితేజ త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి వచ్చిన ట్రైలర్ స్పందన చూస్తే, ఈసారి మాస్ మహారాజా పక్కా బ్లాక్‌బస్టర్ కోసం సెట్ అయ్యాడు అనిపిస్తుంది. గత కొద్దిరోజులుగా రవితేజ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు ‘మాస్ జాతర’పై ఆయన భారీ హోప్స్ పెట్టాడు.
Also Read : Bigg Boss : ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము అవుట్ – రెమ్యూనరేషన్ ఫిగర్స్ వైరల్!
కాగా రవితేజ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ప్రత్యేకంగా నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్లుగా, “ఈగల్ నా ఫేవరెట్ సినిమా. అందులో నేను చేసిన పాత్ర నా కెరీర్‌లో అత్యంత ఇష్టమైనది. కానీ జనాలకు అది అర్థం కాలేదు. మంచి ఐడియా ఉన్నా, స్క్రీన్ ప్లే కొంచెం క్లిష్టంగా ఉండటం వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు. అదే కథను సింపుల్‌గా చెప్పి ఉంటే బాగా వర్కౌట్ అయ్యేది” అని రవితేజ తెలిపారు. అలాగే తన ఇష్టమైన మరో సినిమా ‘నా ఆటోగ్రాఫ్ మెమోరీస్’ గురించి కూడా రవితేజ చెప్పాడు.. “ఆ సినిమా నాకు చాలా ఇష్టం. చాలా మంది హదయాలని తాకింది. కానీ ఆడలేదు. అలాగే ‘నేనింతే’ కూడా అప్పట్లో విజయవంతం కాలేదు. కానీ ఇప్పుడు ఈ రెండూ క్లాసిక్స్‌గా గుర్తింపు పొందాయి” అని గుర్తుచేశారు. రవితేజ అభిప్రాయం ప్రకారం, ఇలాంటి సినిమాలు మొదట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోయినా, కాలక్రమేణా గొప్ప సినిమాలుగా గుర్తింపు పొందతాయి. ఈగల్ కూడా ఓ రోజు క్లాసిక్‌గా మారవచ్చు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.