MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ ఇచ్చింది జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (JSHB). స్థలం విషయంలో ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్ H-(10)A ని కేటాయించింది. అయితే ఈ స్థలాన్ని కేవలం ‘నివాస అవసరాల’ (Residential Use) కోసం మాత్రమే కేటాయించారు. కానీ ప్రస్తుతం అక్కడ ఒక డయాగ్నస్టిక్ సెంటర్ (నీబర్గ్ పల్స్ డయాగ్నస్టిక్స్) నడుస్తోంది. అంటే ఆ ప్లాట్ ను ‘వాణిజ్య అవసరాల’ (Commercial Use) కోసం వాడుతున్నారని బోర్డు గుర్తించింది. ఇది కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించడమేనని బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
ఈ నోటీసుపై స్పందించేందుకు ధోనీకి బోర్డు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలపరిమితిలోగా సరైన వివరణ ఇవ్వకపోతే.. ఆ ప్లాట్ కేటాయింపును రద్దు చేయాలని బోర్డు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఇలా కేవలం ధోనీకే కాకుండా.. ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు జార్ఖండ్ హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు సంజయ్ లాల్ పాశ్వాన్ ధృవీకరించారు.
హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు చాలా ప్రత్యేకం. ఇంటి గోడలపై ఆయన పేరు, జెర్సీ నంబర్ 7, ఫేమస్ హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్‌తో కూడిన చిత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దీనిని ఒక సెల్ఫీ పాయింట్‌లా చూస్తారు. అయితే ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి రాంచీలోని సిమాలియా రింగ్ రోడ్ లో ఉన్న భారీ ఫామ్‌హౌస్ లో నివసిస్తున్నారు. హర్ములోని ఆస్తి ప్రస్తుతం ఆయన పాత నివాసంగా మాత్రమే ఉంది.
Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
ప్రస్తుతం ధోనీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు చివరి ఐపీఎల్ కావచ్చు అని ప్రచారం జరుగుతోంది. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన ఆటతో క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!