తెలుగు సినీ సంగీత ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ వార్తను అధికారికంగా వెల్లడించారు. 1928లో జన్మించిన బాలసరస్వతి చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం ఆరేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించి, అద్భుతమైన స్వరం తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమై, తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందారు.
Also Read : Puri Jagannadh: చార్మితో రిలేషన్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పూరి
‘సతీ అనసూయ’ చిత్రం తో సినీ సంగీతం లో అడుగుపెట్టిన ఆమె, తెలుగు సినిమా తొలి నేపథ్య గాయని గా గుర్తింపు పొందారు. సంగీత ప్రపంచంలో తన ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న బాలసరస్వతి, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 2,000కి పైగా పాటలు ఆలపించారు. గానం మాత్రమే కాకుండా, పలు సినిమాల్లో నటించి కూడా తన ప్రతిభను చాటుకున్నారు. తన మృదువైన స్వరం, భావోద్వేగంతో నిండిన పాటలు గుర్తుచేసుకుంటూ.. సంగీత ప్రేమికులు, సినీ ప్రముఖులు ఆమె మరణాన్ని స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలసరస్వతి మరణం తెలుగు సంగీత ప్రపంచానికి తిరుగులేని లోటుగా మారింది.