ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఒకటి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్ సే కాంబినేషన్ లో..మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పై తన ఆశలన్నీ పెట్టుకున్నారు రామ్ పోతినేని. ఎందుకంటే స్కంద, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా భాగ్యశ్రీ రామ్ పోతినేని కష్టాన్ని పొగుడుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
Also Read : Kiara Advani : వార్ 2 డిజాస్టర్ తో కియారాకి ఎదురు దెబ్బ.. ఏకంగా మూడు సినిమాల డీల్ రద్దు !
‘ప్రియమైన రామ్.. సాగర్ పాత్రలో మీరు చేసే మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు వేట్ చేస్తున్నారు. మీరు ఈ సినిమా కోసం చేసిన కృషి, హార్డ్ వర్క్ కి నేను ఆశ్చర్యపోతున్నాను. ఆంధ్రా కింగ్ తాలూకా మీ అభిమానుల పెద్ద విజయం ఇస్తుంది’ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే భాగ్యశ్రీ బోర్సే రామ్ పోతినేని సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో ఒకే ఒక్క పోస్ట్ తో స్పష్టం చేసింది. అలా రామ్ పోతినేని కష్టాన్ని వివరిస్తూ భాగ్యశ్రీ తన సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టు చూసి.. ఇదో కొత్త రకం స్ట్రాటజీ అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు.