సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందేమాతరం రామచందర్ రావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి బేగంబజార్ లో ఆయన కలిశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన…
కేసీఆర్ ముచ్చట.. అక్బర్ బీర్బల్ కథలా వుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వంకాయ కూర బాగుందంటే బాగుందని భజన బ్యాచ్ అంటున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా హోహో అంటున్నారని విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. మొదటి నుండి బీజేపీకి మద్దతిచ్చిన పార్టీ టీఆర్ఎస్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచారని…
తెలంగాణ టీఆర్ఎస్ లో విభేదాలు ముదురుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒంటెత్తు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భీమారం మండలానికి చెందిన కీలక నేత చెరుకు సరోత్తంరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కొద్ది రోజుల్లో జిల్లా స్థాయిలో 20 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజీనామాలు ప్రకటిస్తామని చెరుకు సరోత్తంరెడ్డి ప్రకటించారు. నిన్న శుక్రవారం ఆయన భీమారంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే…
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు పచ్చజెండా ఊపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య బదిలీల కోసం పలువురు ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అంతరాష్ట్ర బదిలీల కోసం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకు 1338 మంది ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జీఏడీ రాష్ట్ర పునర్విభజన…
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ నారాయణ రావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ కాళోజీ 108వ జయంతి పురస్కరించుకుని హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని , నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాళోజీ తన గళాన్ని వినిపించారని చెప్పారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 25ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి భరతమాత ముద్దుబిడ్డ కాళోజీ నారాయణ రావు అని, కాళోజీ…
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు.. ఆ పార్టీ శ్రేణులు వారిని ఆర్ఆర్ఆర్గా పిల్చుకుంటున్నారు… రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.. అయితే, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి రఘునందన్‌రావు, హుజురాబాద్ బైపోల్లో నెగ్గి ఈటల రాజేందర్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అప్పడికే పార్టీలో సీనియర్…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ గవర్నర్ వ్యవహార శైలి సరికాదు… ఆమె ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిలా పనిచేస్తున్నారు… ఆమెకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.. అంతే కాదు.. తెలంగాణ గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు నారాయణ.. మరోవైపు.. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి విగ్రహాలను పార్లమెంట్ లో ఏర్పాటు…