ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలియనివారుండరు.. ఆయనో కరుడుగట్టిన కమ్యూనిస్టు అనిది నిన్నటి మాట.. ఇప్పుడా ఎర్రమందారం కాస్తా.. కలర్ మారబోతుందా? అనే చర్చ సాగుతోంది.. ఆయన ఈ మధ్య తరచూ వివిధ పార్టీల నేతలను కలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఈ కామ్రేడ్.. ఏ పార్టీ కండువైనా కప్పుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు.. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలను కూడా కలుస్తూ వచ్చారు…
కేసీఆర్, నితీష్ కుమార్ లాంటి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా... నరేంద్ర మోడీని ఏమీ చేయలేరు.. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలేనని.. ప్రధాని అంటేనే బాగ్ మిల్కా బాగ్ లా పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది… తాజా పరిణామాలపై ఫైర్ అయ్యారు ఈటల… నన్ను సభకు రానియొద్దని అయన అనుకున్నట్టునాడు.. కానీ, కేసీఆర్‌ని సభకు రాకుండా చేసే బాధ్యత నాది అని నేను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు.. కేసీఆర్ ది శంకిని తనం అని మండిపడ్డ ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంకా ఎన్ని రోజులు ఈ మీటర్ల గురించి మాట్లాడుతారని ప్రశ్నించిన ఈటల…
భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని.. బీజేపీ టార్గెట్ చేస్తోంది.. పాదయాత్రలో ఉపయోగిస్తున్న కంటైనర్ల నుంచి అనేక రకాల విమర్శలు సందిస్తున్నారు.. అంతేకాదు.. రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.. అయితే, రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద బీజేపీ మాట్లాడి దిగజారుడు పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీని ఏం విమర్శించాలో అర్దం కాక.. టీ షర్ట్ మీద విమర్శలు చేస్తున్నారని…
తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్టుగా.. ఇప్పుడు దాదాపు 115 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టేశాయి.. జులై, ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. జులై నెలలో కురిసిన వర్షాలకు ఊళ్లకు ఊళ్లే కొన్ని వారాల పాటు వరద ముంపునకు గురికాగా.. పూర్తిస్థాయిలో తేరుకోకముందే మరోసారి వర్షాలు అందుకున్నాయి.. దీంతో, మళ్లీ వరద ముంపు పెరుగుతోంది. జులై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆగస్టులో…
రైలు బండి.. దాని స్పీడ్‌పై గతంలోనే అనేక పాటలు వచ్చాయి… కానీ, కాల క్రమంగా రైళ్ల రూపం మారిపోయింది.. వేగం పెరిగింది.. ఇక, జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యాయి రైళ్లు.. నేటి నుంచి దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల వేగం మరింత పెరగనుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా పట్టాలపై రైళ్లు మరింత స్పీడ్‌తో దూసుకెళ్లనున్నాయి. ట్రాక్ అప్‌గ్రెడేషన్ పనులు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి మూడు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్,…
* హైదరాబాద్: నేడు మొయినాబాద్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు, కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు * ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఏడు బిల్లులపై శాసనసభలో చర్చ, ఆమోదం, కేంద్ర విద్యుత్ బిల్లు, పరిణామాలపై స్వల్ప కాలిక చర్చ * గుంటూరు: నేడు అమరావతి నుండి అరసవల్లి వరకు రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం… నేడు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కృష్ణయ్య పాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు మీదుగా…
నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారు. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. అనంతరం కేంద్ర విద్యుత్ , తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు ను సభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజ్…