నాటో తరహాలో ఇప్పుడు ‘ముస్లిం నాటో’ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం పాకిస్థాన్-టర్కీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా-పాకిస్థాన్ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఎవరైనా ఒక దేశంపై దాడి చేస్తే తమపై కూడా దాడి చేసినట్లుగా భావించి ఇద్దరూ కలిసి శత్రువును ఎదుర్కొంటారు. తాజాగా అదే తరహాలో అన్ని ముుస్లిం దేశాలు నాటోగా ఏర్పడాలని టర్కీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indo-China: డ్రాగన్ కవ్వింపులు.. వివాదాస్పద సరిహద్దుపై పాక్‌తో ఒప్పందం.. భారత్ మండిపాటు
పాకిస్థాన్-సౌదీ నేతృత్వంలోని ముస్లిం నాటోలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టర్కీ సంకేతాలు ఇచ్చింది. టర్కీ, సౌదీ ఆర్థిక సాయం.. పాకిస్థాన్ అణుశక్తితో కలిసి ఈ దేశాలు ఒక కూటమిగా ఏర్పడొచ్చని పేర్కొంది. ఇందుకోసం టర్కీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్థాన్‌కు మద్దతు తెలిపింది. ఇప్పుడు ముస్లిం నాటో కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టర్కీ రాజధాని అంకారాలో జరిగిన చర్చలు పురోగతిని ఇచ్చినట్లుగా సమాచారం. ముస్లిం నాటో కూటమి ఏర్పడే అవకాశం ఉందని తెలిసిన వ్యక్తుల నుంచి అందించబడిన వర్గాల ద్వారా తెలిసింది.
సౌదీ అరేబియా దగ్గర ఆర్థిక బలం ఉంది. పాకిస్థాన్ దగ్గర అణ్వాయుధ సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణులు, మానవశక్తి ఉంది. ఇక టర్కీ దగ్గర సైనిక సామర్థ్యం, రక్షణ తయారీ స్థావరం ఉంది. ఇలా మూడు దేశాలు కలిస్తే పశ్చిమాసియా, దక్షిణాసియాలో పెత్తనం చెలాయించవచ్చని భావిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో భారత్ రక్షణ ఒప్పందం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముస్లిం నాటో భారత్‌కు వ్యతిరేకంగానే ఉండనుంది. ఈ క్రమంలో భారత్ చాలా నిశితంగా పరిశీలిస్తోంది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీకి గుడ్‌న్యూస్.. రూ.567 కోట్లు విడుదల చేసిన కేంద్రం