మనం పాములు, కొండచిలువల పేర్లు వినగానే వణికిపోతాం. అందునా భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో కొండ చిలువలు హల్ చల్ చేస్తున్నాయి. తాడేపల్లిలోని సీతానగరం ప్రకాశం బ్యారేజీ వద్ద కొండచిలువ కలకలం రేపింది. కృష్ణా నది నుండి నీటిని దిగువకు విడుదల చేయడంతో నీటిలో 6 అడుగుల కొండచిలువ కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజీ గేటు వద్దకు వచ్చి గేటు చైన్ పట్టుకొని ఆగిపోయింది. అక్కడికి చేరుకున్న అధికారులు సిబ్బంది సహాయంతో కొండచిలువని పట్టుకున్నారు.
Read Also: Lalitha Jewellery In Chandanagar: చందానగర్ లో లలితా జ్యూవెలరీ షోరూం ప్రారంభం
కొండ చిలువని చూసి అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సాధారణంగా కొండ చిలువలు నేలమీదకి వచ్చి చిన్న చిన్న జంతువుల్ని మింగేస్తుంటాయి. ఎడతెగని వర్షాల నేపథ్యంలో ఏపీలోని అన్ని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. సోమశిల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 45వేల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 61 వేల క్యూసెక్కులుగా వుంది. ప్రస్తుత నీటిమట్టం 71.294 టీఎంసీలు అని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. ఇటు కర్నాటకలో వర్షాలు పడుతుండడంతో కృష్ణా, తుంగభద్ర నదులు హోరెత్తుతున్నాయి. శ్రీశైల జలాశయానికి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,56,442 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,40,991 క్యూసెక్కులుగా వుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా వుంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. 16 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో… 3లక్షల 85వేల 74 క్యూసెక్కులు గా వుండగా..అవుట్ ఫ్లో… 4లక్షల 17వేల 358 క్యూసెక్కులుగా వుంది.
Read Also: Lalitha Jewellery In Chandanagar: చందానగర్ లో లలితా జ్యూవెలరీ షోరూం ప్రారంభం