కేసీఆర్ ముచ్చట.. అక్బర్ బీర్బల్ కథలా వుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వంకాయ కూర బాగుందంటే బాగుందని భజన బ్యాచ్ అంటున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా హోహో అంటున్నారని విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. మొదటి నుండి బీజేపీకి మద్దతిచ్చిన పార్టీ టీఆర్‌ఎస్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఇక ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవ చేశారు. తెలంగాణ పబ్లిక్ కు ఇచ్చిన హామీలు అమలు చేసి, దేశ రాజకీయాల గురించి మాట్లాడండి అని విమర్శించారు. త్రీడి షో తప్పా ఏమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఇప్పుడు ఒక్కటి అమలు కావడం లేదని అన్నారు. కొత్త బిచ్చగాళ్లుగా టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కొట్లాడుకుంటున్నారని అన్నారు. రేషన్ షాపుల వద్ద, మరుగు దొడ్ల వద్ద మా ఫోటోలు లేవంటే మా ఫోటోలు లేవని కొట్లాడుకుంటున్నారని ఎద్దేవ చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండని అన్నారు.
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో మా సీటు కాదు.. మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటామన్నారు. నేను కూడా ప్రచారానికి వెళ్తా అని స్పష్టం చేశారు. తనకు సీనియార్టీ వచ్చినప్పుడు గాంధీ భవన్ మీటింగ్ లో, ప్రియాంక గాంధీ వద్ద హాజరవుతా అని స్పష్టం చేశారు. అప్పటి వరకు నా నియోజకవర్గంలోనే ఉంటానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Python in Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొండ చిలువ కలకలం