Return Rush to Hyderabad: సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వచ్చినవారు తిరిగి తమ ఉద్యోగాలు, విధులు నిర్వహించేందుకు హైదరాబాద్కు బయల్దేరడంతో జాతీయ రహదారులపై తీవ్ర వాహన రద్దీ నెలకొంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బెజవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా వాహనాలు బయల్దేరడంతో టోల్…
దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు కొత్త వెలుగులు తేవాలి.. సీఎం భోగి శుభాకాంక్షలు.. తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాలుకు సిద్ధం అవుతున్నాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. రేపు అనగా బుధవారం రోజు భోగి పండుగ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న…
20 ఏళ్ల వరకు అధికారంలో కూటమి ప్రభుత్వం..! చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్…
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పు చెల్లింపు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, ఆదర్షనగర్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రమ్య సుధ (36) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్న భర్త శ్రీధర్. భార్య రమ్యసుధ వరంగల్ జిల్లా రాయపర్తి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. బట్టల వ్యాపారం సరిగా లేక, ఇంటి నిర్మాణం కోసం అప్పులు ఎక్కువైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Also Read:Bhartha Mahasayulaku…
చైనా మాంజా ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురు వ్యక్తులు మాంజా కారణంగా తీవ్రగాయాలపాలవుతుండగా.. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో ఏఎస్ఐకి మాంజా తగిలి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. నల్లకుంట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మెడకు మాంజా చుట్టుకోవడంతో గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ PS పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద సాయంత్రం మాంజా…
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద తెల్లవారుజామున జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కోలా నరేష్ (PC -184) అక్కడిక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాన్ని చౌటుప్పల్ మార్చురికి తరలించారు. మృతుడి స్వస్థలం తాడ్వాయి గ్రామం మునగాల మండలం సూర్యాపేట జిల్లాగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఒక…
కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు జలసమాధి అయిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడిని మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన సంగం రాజు గా పోలీసులు గుర్తించారు. ఉన్నట్టుండి రాజు మిస్ అవ్వడంతో తల్లి స్వరూప పెట్టిన మిస్సింగ్ కేసు ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:Anaganaga oka Raju : జనవరి 14న…